![]() |
![]() |

పవిత్ర సంతోష్ కి ఎస్ చెప్పేసిందంట. ఒక సంవత్సరం క్రితం సంతోష్ తనకి ప్రపోజ్ చేస్తే, ఇప్పుడు స్టేజ్ మీద తనకి ప్రపోజ్ చేస్తున్నట్టు తన యూట్యూబ్ ఛానెల్ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది.
జబర్దస్త్ పవిత్ర.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. జీ తెలుగులో వస్తున్న సూపర్ క్వీన్ లో వాళ్ళ అమ్మని తీసుకొచ్చి తన జీవితం ఎలా ఉందో చెప్తూ ఎమోషనల్ అవడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వాళ్ళ అమ్మ చేసిన కష్టాలని దగ్గరనుండి చూసిన పవిత్ర.. తన చదువు ఇంటర్మీడియట్ వరకే ఆపేసిందంట. తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అంట్లు తోమడానికి వెళ్ళినప్పుడు సాయం చేయడానికి తను కూడా వెళ్ళిందంట. జబర్దస్త్ కామెడీ షోలో ఒకప్పుడు లేడీ కమేడియన్లు ఉండేవాళ్ళు కాదు అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకొని కామెడీని చేసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగానే కన్పిస్తున్నారు. భాస్కర్ టీం, హైపర్ ఆది టీం, వెంకీ మంకీస్ టీం, రాకెట్ రాఘవ టీం ఇలా అందరి టీంలలో కామన్ గా ఉంటున్న పవిత్ర.. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటుంది.
ఇమాన్యుయల్ తో కలిసి మంచి బాండింగ్ ఉన్న పవిత్ర రెగ్యులర్ రా రీల్స్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంటుంది. తాజాగా పవిత్ర తన యూట్యూబ్ ఛానెల్ లో ' ఫైనల్ గా సంతోష్ కి ఒక క్లారిటీ ఇచ్చేశాను' అంటూ ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేసింది. ఇందులో సంతోష్ అనే అతడికి స్టేజ్ మీద ప్రపోజ్ చేస్తున్నట్టుగా, అతను తనకి ఒక సంవత్సరం క్రితం ప్రపోజ్ చేసాడని అంది. స్టేజ్ మీదనే సంతోష్ ఎమోషనల్ అయ్యాడంటూ పవిత్ర చెప్పుకొచ్చిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
![]() |
![]() |